ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి మంచి బజ్ తో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి హీరోగా దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “కోర్ట్”. పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా కల్పిత డ్రామా యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకి ఆల్రడీ హిట్ రిపోర్ట్స్ ఉన్నాయి.
మరి నేడు తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ ని గ్రాండ్ గా మేకర్స్ ప్లాన్ చేయగా వీటికి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ రిలీజ్ ముందు అయితే నాచురల్ స్టార్ అలాగే ఈ సినిమా నిర్మాత నాని యువ హీరో ప్రియదర్శికి ఇచ్చిన ఓ స్వీట్ హగ్ పిక్ ఇపుడు మంచి ఫోటో మూమెంట్ గా మారింది. ఇవాళ రాత్రి అంటూ నాని చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా గ్రాండ్ గా ఫుల్ ఫ్లెడ్జ్ థియేటర్స్ లో రేపు మార్చ్ 14 నుంచి విడుదల కాబోతుంది.