మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
‘చికిరి’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. అసలు ఈ ‘చికిరి’ అంటే ఏమిటి..? అనే విషయాన్ని నవంబర్ 5న ఉదయం 11.07 గంటలకు ప్రపంచానికి తెలుస్తుంది అంటూ మేకర్స్ ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీ మ్యూజిక్ ఎలాంటి మ్యాజిక్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


