పెళ్లిలోని మాధుర్యమే ఈ సినిమా

పెళ్లిలోని మాధుర్యమే ఈ సినిమా

Published on Dec 4, 2012 12:30 AM IST

‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ హీరోగా ‘మేం వయసుకు వచ్చాం’ నీతి టేలర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘పెళ్లి పుస్తకం’. గతంలో బాపు గారి సినిమా టైటిల్ అయినా ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదంటున్నారు ఈ చిత్ర దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి. ఆయన మాట్లాడుతూ ‘ సినిమా 75% పూర్తయ్యింది. పెళ్ళైన తర్వాత వైవాహిక జీవితంలో మధురాను భూతుల్నే ఈ సినిమాలో చూపిస్తున్నాము. ఈ నెల 6 నుంచి 22 వరకు అనంతపురంలో ఒక షెడ్యూల్ చేయనున్నాం. ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్ మరియు రెండు పాటలు షూట్ చేస్తాం. మిగిలిన రెండు పాటలను జనవరిలో విదేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నాడు. బి. నాగిరెడ్డి, బి.వి గోపాల్, ఫై.సుమన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు