IPLలో ‘పెద్ది’ మాస్ రీచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ వీడియో

IPLలో ‘పెద్ది’ మాస్ రీచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ వీడియో

Published on May 6, 2025 7:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అల్రెడీ వచ్చిన ఫస్ట్ షాట్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఐపీఎల్ కి ముందు రిలీజ్ చేసిన ఈ సినిమా తాలూకా గ్లింప్స్ ఇపుడు మంచి రీచ్ ని సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి.

సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలోనే కావడంతో చాలా ఐపీఎల్ జట్లు పెద్ది గ్లింప్స్ లో ఐకానిక్ షాట్స్ ని రీక్రియేట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఒక స్పెషల్ వీడియో కూడా వచ్చింది. పెద్ది హిందీ వెర్షన్ ని ఢిల్లీ జట్టు రీక్రియేట్ చేసింది. ఇక యంగ్ సెన్సేషన్ అశుతోష్ రామ్ చరణ్ మట్టి షాట్ ని అలాగే లాస్ట్ షాట్ ని రీక్రియేట్ చేయడం మరింత వైరల్ గా మారింది. మొత్తానికి మాత్రం ఏపీఎల్ లో పెద్ది మేనియా గట్టిగానే కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు