అభిమానులతో పవన్ చిత్రీకరణ వాయిదా

అభిమానులతో పవన్ చిత్రీకరణ వాయిదా

Published on Jul 20, 2012 4:22 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి చెయ్యనున్న సన్నివేశ చిత్రీకరణ రేపు జరగాల్సి ఉంది. ఈ సనివేశాన్ని “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం కోసం చిత్రీకరించనున్నారు. పవన్ వారి అభిమానులతో కలిసి నడుస్తూ ఉన్నట్టు సన్నివేశం. వాతావరణం బాగాలేని కారణంగా ఈ చిత్రీకరణకి అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సన్నివేశ చిత్రీకరణ తేది వాయిదా పడింది అని త్వరలో తేదిని ప్రకటిస్తాం అని పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయికగా కనిపిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల అవుతుంది.

తాజా వార్తలు