పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు సంబందించిన ముహూర్త కార్యక్రమాలు ఈ రోజు ఫిల్మ్ నగర్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ఈ సినిమా ప్రొడక్షన్ టీం హాజరయ్యారు. అలాగే సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు, జెమినీ కిరణ్ కూడా హాజరయ్యారు. ఫస్ట్ షాట్ ని అడ్వకేట్ ప్రమోద్ రెడ్డి డైరెక్టర్ చేయగా శరత్ తండ్రి జీ కె మరార్ క్లాప్ కొట్టారు. అనంతరం నిర్మాత శరత్ మరార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుండి మొదలవుతుంది అని అన్నాడు. సీనియర్ రచయిత సత్యానంద్ తో పాటు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సూపర్ వైస్ చేశాడని అన్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి జయనన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమా దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబందించిన వివరాలను టీం తెలియజేసింది. అయితే హీరోయిన్ వివరాలు మాత్రం తెలియజేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.