‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మరో ‘గబ్బర్ సింగ్’ కానుందా?


పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జర్నలిస్టుగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగంతో రాంబాబు’తో పవన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నడా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇటీవలే హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’తో హిట్ ట్రాక్ మీదికి వచ్చిన పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు తో మరో హిట్ గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమాకి పనిచేస్తున్న యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ లుకింగ్. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఇలా అన్ని విషయాల్లోనూ పవన్ అభిమానులని అలరించేలా ఉండబోతున్నదని. పూరి డైలాగులకి పవన్ చెప్పే డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని, కొన్ని రాజకీయ అంశాలను కూడా చూపిన్చాబోతున్నారని సమాచారం. ఇవన్ని వెరసి పవన్ మరో హిట్ కొట్టబోతున్నాడని అందరు నమ్ముతున్నారు.

Exit mobile version