పవన్ మూవీ ఆడియో వేడుకకి ఖరారైన వేదిక

పవన్ మూవీ ఆడియో వేడుకకి ఖరారైన వేదిక

Published on Jul 16, 2013 5:40 PM IST

Attarintiki-Daredi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో విడుదల వేడుకని జూలై 19వ తేదిన శిల్ప కళావేదికలో నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ మద్య విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, నందితలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మానందం, అలీ కమెడియన్స్ గా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు