బ్రహ్మానందాన్ని టీజ్ చేస్తూ పవన్ సాంగ్

బ్రహ్మానందాన్ని టీజ్ చేస్తూ పవన్ సాంగ్

Published on Aug 1, 2013 4:47 PM IST

Pawan-and-Brahmananandam
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఒక పాటకి తన వాయిస్ ని ఇవ్వనున్నారు. ఈ పాట ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందం పై ఫోకస్ చేస్తూ ఉండనుంది అని తెలిసింది. ఈ పాటలో పవన్ స్టార్ కమెడియన్ ని టీజ్ చేస్తూ పాడనున్నాడని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబందించిన రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఆగష్టు 7న విడుదలకానుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తను చాలా గ్లామరస్ గా కనిపించనుంది. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు