ఈ రోజుతో డబ్బింగ్ పూర్తి చేయనున్న పవన్ కళ్యాణ్

ఈ రోజుతో డబ్బింగ్ పూర్తి చేయనున్న పవన్ కళ్యాణ్

Published on Apr 17, 2012 9:22 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి నేటితో డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ‘కెవ్వు కేక’ పాట అన్నపూర్ణ స్టుడియోలోని సేవన్ ఏకర్స్ లో చిత్రీకరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఆది వారం విడుదలై యువతను ఆకర్షిస్తున్నాయి. శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిరపకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు