పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి త్వరలో కానుక ఇవ్వబోతున్నాడు. అది ఏమిటి అనుకుంటున్నారా? గబ్బర్ సింగ్! అవును పోఅవాన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో తన అభిమానుల కోసం కానుక ఇవ్వనున్నాడు. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పాట పాడాడు. స్క్రిప్టులో భాగంగా వచ్చే మందు పాటకి పవన్ కళ్యాణ్ తన గాత్రం అందించాడు. ఈ పాటలో పవన్ వేసే స్టెప్పులు అభిమానులని అలరిస్తాయి సమాచారం. ఈ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన దబంగ్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్నప్పటికీ తెలుగు నేటివిటీకి తగట్లుగా చాలా మార్పులు చేసినట్లుగా సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ అసంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 15న ఈ చిత్ర ఆడియో అభిమానుల సమక్షంలో విడుదల కానుంది.