పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటన మరియు వ్యక్తితవంతో కొన్ని కోట్ల మంది అభిమానుల ప్రేమానురాగాలను అందుకుంటున్నారు. స్వతహాగా ఆడంబరాలకు, అట్టహాసాలకు ఇష్టపడని పవన్ కళ్యాణ్ తన అభిమానులకి కూడా అదే సలహాని ఇస్తారు. ఆయన ఒక భాద్యత గల టీవీ న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన తన అభిమానులకు ఇచ్చిన ఒక చక్కని సందేశం కథా రచయిత బి.వి.ఎస్ రవి ద్వారా వెలుగులోకి వచ్చింది. పవన్ అభిమానులు తమ ఇంటిపేరు లాగా చెప్పుకునే పవనిజం అంటే ఏమిటో పవన్ చెప్పారు. అదేంటో ఆయన మాటల్లోనే ‘ పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని’ ఆయన అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.