రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ – సమంతల సందడి

రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ – సమంతల సందడి

Published on May 14, 2013 12:23 PM IST

Samantha-and-Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సమంత జంటగా డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న విషయం మనందరికి తెలుసు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వీరిద్దరిపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ ని ఖరారు చేయలేదు. కానీ ఈ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. త్రివిక్రమ్ ఈ సినిమాని ఒక మంచి ట్రేడ్ మార్క్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో విదుదలైయ్యే అవకాశం వుంది. ఈ సినిమా విదేశీ షెడ్యూల్ జూన్ మొదటి వారం నుండి ప్రారంభంకానుంది.

తాజా వార్తలు