పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉండగా ఇంకో నెలలో మొత్తం షూటింగ్ ముగియనుంది. ఇది పూర్తయ్యాక కొద్దిగా గ్యాప్ తీసుకుని క్రిష్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయనున్నారు పవన్. ఇప్పటికే కొద్దిగా షూటింగ్ కూడ జరిపారు. అయితే ఈ గ్యాప్లో మరొక సినిమాను లాగించాలని చూస్తున్నారట ఆయన. సుమారు రెండు నుండి మూడు నెలల గ్యాప్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సెట్టింగులు, ఫారిన్ ట్రిప్స్ అవసరంలేని సినిమా అయితే ఫినిష్ చేయవచ్చని భావిస్తున్నారట.
ఇంతకీ ఆ సినిమా ఏమిటనుకుంటున్నారా.. అదే ‘అయ్యప్పన్ కోషియమ్’. చాలా రోజుల నుండి ఈ సినిమాను పవన్ చేస్తారనే వార్తలు వినిపిస్తుండగా తాజాగా పవన్ రీమేక్ చిత్రాన్ని చేయడానికి సిద్దమయ్యారని, అందులో ప్రముఖ నటుడు రానా కీ రోల్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మోస్ట్లీ వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ఉండొచ్చట. అయితే దర్శకుడే ఇంకా ఫైనల్ కాలేదట. పవన్, రానాల కాంబినేషన్ అంటే పెద్ద దర్శకుడే ఉండాలి. ప్రజెంట్ పెద్ద దర్శకులంతా ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ఒక్కసారి డైరెక్టర్ లాక్ అయితే ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లడమే అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.