పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే మంకు గుర్తుకు వచ్చేది అతను కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు సమాజం పట్ల భాద్యత, గౌరవం ఉన్న వ్యక్తి అని, అది ఎవరిని అడిగినా చెప్తారు లేదా ఏ ఒక్క పవన్ అభిమానిని అడిగినా చెప్తారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజ్. ఆయన రెగ్యులర్ సినిమా ఫంక్షన్ లకి పెద్దగా ఆసక్తి చూపకపోయినా తన వల్ల సమాజానికి ఏదన్నా మేలు జరిగే విషయం ఉంది అంటే మాత్రం కచ్చితంగా ప్రోత్సహించి తన వంతు సాయం చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేయనున్నారు.
ప్రజాహిత సోషల్ సెర్విచె ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పబడిన ‘హృదయ స్పందన ఫౌండేషన్’ వారు నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ‘వాక్ ఫర్ హార్ట్ రీచ్ ఫర్ ఎ హార్ట్’ అని జరగనున్న ఈ కార్యక్రమం మార్చి 2న సాయంత్రం 6 గంటలకి పివి ఘాట్, నెక్లెస్ రోడ్ లో ప్రారంభం కానుంది. ఈ వాక్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమంలో మీరుకూడా పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ కొరకు https://www.facebook.com/HrudayaSpandanaFoundation ని విజిట్ చేయండి.