అత్తాపూర్ బాబా గా పవన్ కళ్యాణ్

అత్తాపూర్ బాబా గా పవన్ కళ్యాణ్

Published on Jul 11, 2013 12:42 PM IST

pawanbaba
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తమ అబిమానులకు, ప్రేక్షకుల కోసం మంచి కామెడీతో ఎంటర్టైనింగ్ చేయనున్నాడు. మేము మొదటి నుండి చెప్పినట్టుగా ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉండనుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ అత్తాపూర్ బాబాగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ టీం ఈ సినిమాని ఆగష్టు 7న గ్రాండ్ గా విడుదల చేయాలనుకుంటోంది. ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫేమస్ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు