ఈరోజు మన టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణంతో మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఎందరో స్టార్ నటులు ఆయన మరణం పట్ల తమ విచారం వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాని ఇలా ఎంతోమంది ఆయన మరణం పట్ల నివాళులు ఆరోపించారు. ఇపుడు వారితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
ఈ ప్రెస్ నోట్ ద్వారా ఆయన మరణం దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన కుటుంబానికి తన ప్రఘాడ సానుభూతిని తెలిపారు. రాయలసీమ మాండలికాన్ని అద్భుతంగా ఆయన పలికిస్తారని అలాగే ఆయన ఒక పక్క సినిమాలు చేస్తూనే నాటక రంగాన్ని కూడా ఎప్పుడు విడువలేదని అలాంటి వ్యక్తి మరణం తీరని లోటని పవన్ అభిప్రాయ పడ్డారు. అలాగే ఆయన మరణం పట్ల వాటి కుటుంబానికి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.