పాకీజా (నటి వాసుకి) కి పవన్ ఆర్ధిక సాయం.!

పాకీజా (నటి వాసుకి) కి పవన్ ఆర్ధిక సాయం.!

Published on Jul 1, 2025 3:05 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అని అందరికీ తెలిసిందే. ఎంతోమందికి తాను ఆర్ధిక సాయం అందించి ఆదుకున్న ఘటనలు కోకొల్లలు. మరి లేటెస్ట్ ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. మన తెలుగు సినిమా దగ్గర పాకీజాగా గుర్తుడిపోయే పాత్ర సహా మరిన్ని హాస్య ఇతర ఎమోషనల్ పాత్రల్లో కూడా కనిపించిన నటి వాసుకి ఈ మధ్య బాగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో బయటకి వచ్చాయి.

మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించినట్టుగా తన టీం చెబుతుంది. మంగళగిరిలో ఈ మధ్యాహ్నం అక్కడి జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పి. హరిప్రసాద్ గారు, పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు ఆ మొత్తం అందజేశారు. దీనితో పవన్ ఉదారత మరోసారి చాటుకున్నారని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ జూలై 3న గ్రాండ్ గా థియేటర్స్ లో లాంచ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు