బుకింగ్స్ లో ‘కన్నప్ప’కి సాలిడ్ రెస్పాన్స్

బుకింగ్స్ లో ‘కన్నప్ప’కి సాలిడ్ రెస్పాన్స్

Published on Jul 1, 2025 1:59 PM IST

మంచు విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన లేటెస్ట్ డివోషనల్ హిట్ చిత్రమే “కన్నప్ప”. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సహా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని విష్ణు కెరీర్లోనే భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇలా నాలుగు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న కన్నప్ప ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇలా ఒక్క బుక్ మై షోలోనే హాఫ్ మిలియన్ కి పైగా టికెట్స్ ని సేల్ చేసుకుంది. ఇది విష్ణు కెరీర్లోనే అత్యధికం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి దిగ్గజాలు నటించగా మోహన్ బాబు కూడా పవర్ఫుల్ పాత్ర పోషించారు. అలాగే తానే ఈ చిత్రానికి నిర్మాణం కూడా వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు