ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కొట్టిన ఐకానిక్ సూపర్ హిట్ చిత్రాల్లో పుష్ప సినిమాలు కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సాలిడ్ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా షేక్ చేసాయి. అయితే పార్ట్ 1 కి ఇండియా మొత్తం షేక్ అయితే పార్ట్ 2 తో మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప రాజ్ మేనియా సాగుతుంది అని చెప్పాలి.
మరి లేటెస్ట్ గా వరల్డ్ ఫేమస్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ వారు సోషల్ మీడియాలో పాపులర్ ఆటగాడు జొకోవిచ్ కి పుష్ప రాజ్ సిగ్నేచర్ తగ్గేదేలే పోస్ట్ తో ప్రచారం చేయడం వైరల్ గా మారింది. దీనితో పుష్ప మేనియా ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా మూడో భాగం పుష్ప ది ర్యాంపేజ్ కూడా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా అయ్యాక బన్నీ ఇది స్టార్ట్ చేయనున్నాడు.