పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుండి మూడో సింగిల్ సాంగ్‌గా ‘అసుర హననం’ అనే పాటను లాంచ్ చేశారు.
ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్రానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని.. ‘తార సితార’ అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ తెలిపాడని.. ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండటంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపాడని.. వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డింగ్ చేయించాడని కీరవాణి అన్నారు.
ఇలా తన పదవి పట్ట నిబద్ధతగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమా తన నుంచి ఆశిస్తారో ఆయనకు స్పష్టంగా తెలుసని కీరవాణి అన్నారు. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే పాట ఇదే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.