ఇకనైనా పార్టీ పెట్టకపోతే పవన్ పెద్ద ఇడియట్ అవుతాడు – వర్మ

ఇకనైనా పార్టీ పెట్టకపోతే పవన్ పెద్ద ఇడియట్ అవుతాడు – వర్మ

Published on Oct 1, 2013 9:15 AM IST

pavan-and-rgv
ఆంధ్ర ప్రదేశ్ లో గానీ లేదా ఇండియాలో గానీ ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతోంది అంటే ఒకరు మాత్రం దాని గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. అతను ఇంకెవరో కాదు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే. ప్రస్తుతం ఆయన తన అస్త్రాలను పవన్ కళ్యాణ్ పైన మరియు ‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్ పైకి వదిలాడు.

కొద్ది రోజుల క్రితం వర్మ పవన్ కళ్యాణ్ ని సొంత రాజకీయ పార్తే పెట్టమని కోరారు. ఈ రోజు మరో స్టెప్ ముందుకేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘ అత్తారింటికి దారేది సక్సెస్ తో ప్రజలు పవన్ ని ఎంత అభిమానిస్తున్నారో తెలుసుకోవాలి, ఇప్పటికయినా పార్టీ పెట్టకపోతే ఆయనొక పెద్ద ఇడియట్ అవుతాడు. అలాగే అత్తారింటికి దారేది సినిమా ఆయన వల్ల కంటే అభిమానుల్లో ఆయన మీద ఉన్న ప్రేమ వల్లే అంత పెద్ద సక్సెస్ అయ్యిందనే విషయాన్ని తెలుసుకోవాలని’ ట్వీట్ చేసాడు.

అంతటితో ఆగని వర్మ పవన్ ని చిరంజీవితో పోల్చాడు. ‘ మెగాస్టార్ లాంటి పేరు కూడా పవర్ స్టార్ ముందు తక్కువే. అతనికి సునామి స్టార్ అని పేరు మార్చాలి. పవన్ కళ్యాన్ హిమాలయాల శిఖరాన్ని చేరుకుంటే, చిరంజీవి గారు మాత్రం 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ ఇంకా పర్వతం యొక్క మొదట్లోనే ఉన్నారని’ ట్వీట్ చేసాడు.

వర్మ ట్వీట్స్ పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? పవన్ కళ్యాణ్ పార్టీ మొదలు పెడతారంటారా? మీ సమాధానాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు