పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలోని ప్రిన్సెస్ కేఫ్ ప్రాంతంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే సారధి స్టూడియోస్ మరియు పద్మాలయ స్టూడియోస్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాధ్ వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.