ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులు చాలానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా గట్టి దెబ్బ వేసింది.
దీనితో అక్కడ నుంచి ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక అధికారిక అప్డేట్ కోసం తప్ప మరేమి పవన్ ఫ్యాన్స్ ఆశించడం లేదు. అదనుకు తగ్గట్టుగానే ఒక్కో స్పెషల్ డే కు ఒక్కో అప్డేట్ ను మేకర్స్ అందిస్తున్నారు. అలా ఈసారి మరో బిగ్ డే దసరా రేస్ లో వకీల్ సాబ్ టీజర్ ఉంటుందా లేదా అన్నది మంచి ఆసక్తిరంగా మారింది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదని తెలుస్తుంది.
కానీ ఈ దసరాకు మాత్రం మరో ఉపాదాయ ను మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే షూట్ పూర్తి కావస్తున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి రేస్ లో ఉండనుంది అని గట్టి బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని మేకర్స్ బహుశా ప్రకటించనున్నారేమో అని టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.