పవన్ ఫ్యాన్స్ ఆశ అదే…మరి నిర్మాత ఏం చేస్తారో?

పవన్ ఫ్యాన్స్ ఆశ అదే…మరి నిర్మాత ఏం చేస్తారో?

Published on Jun 13, 2020 12:52 AM IST

కరోనా లాక్ డౌన్ పవన్ ఫ్యాన్స్ ని బాగా బాధపెడుతోంది. ఏళ్ల తరబడి పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి లాక్ డౌన్ భారీ షాక్ ఇచ్చింది. పవన్ కమ్ బ్యాక్ మూవీ మరో రెండు నెలల్లో థియేటర్స్ లో విడుదల అవుతుంది అనుకున్న టైం లో లాక్ డౌన్ వచ్చి భారీ షాక్ ఇచ్చింది. ఇక చివరి దశలో వకీల్ సాబ్ షూటింగ్ ఆగిపోయింది. మరి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పాటు, షూటింగ్స్ కి అనుమతి కూడా ఇచ్చిన నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి మూవీ విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరో వైపు లాక్ డౌన్ సడలించినా, కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. థియేటర్స్ కి ఇంకా అనుమతి రాలేదు. ఒక వేళ షూటింగ్ పూర్తి అయినా సినిమా థియేటర్ విడుదలకు నోచుకుంటుందన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఓ టి టి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఫ్యాన్స్ మాత్రం వకీల్ సాబ్ ని థియేటర్స్ లోనే చూడాలని కోరుకుంటుండగా నిర్మాత మరి ఏ నిర్ణయం తీసుకుంటారో .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు