గ్యాస్ లీక్ ఉదంతంపై పవన్, బన్నీ, చరణ్ ల విచారం

వైజాగ్ లో నేడు తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ఘటనపై స్పందించారు.

మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. చికిత్స తీసుకుంటున్న వారికి మంచి వైద్యం అందించాలని వారు అధికారులను అభ్యర్ధించారు. అలాగే వైజాగ్ సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అలాంటి నగరానికి ఇలా కావడం కలచివేసింది అన్నారు.

Exit mobile version