మొదలైన పైసా డిటిఎస్ మిక్సింగ్

మొదలైన పైసా డిటిఎస్ మిక్సింగ్

Published on Jul 31, 2013 3:51 PM IST

paisa-movie-audio-launch-po

యంగ్ హీరో నాని నటించిన ‘పైసా’ సినిమా డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని కారణాల వల్ల ‘పైసా’ కొద్ది రోజులు ఆలస్యమైంది కానీ మళ్ళీ దానికి సంబందించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

కేథరిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించాడు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చాలా కాలం తర్వాత విలక్షణ నటుడు చరణ్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మనీ లాండరింగ్, హవాలా చుట్టూ తిరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు