ముంబై హీరోయిన్స్ కంటే మన వారే బెటర్ అంటున్న అలీ.!

ముంబై హీరోయిన్స్ కంటే మన వారే బెటర్ అంటున్న అలీ.!

Published on Oct 15, 2012 3:30 PM IST


ఒక దర్శకుడు,హీరో మరియు నిర్మాత కలిసి ఎంత కష్టపడి సినిమా తీసినా దానికి సరైన ప్రమోషన్స్ లేకుండా ఇప్పట్లో సినిమా విడుదల చేస్తే ఆ సినిమా అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా తీసుకుంటున్న ముంబై భామలు అసలు సినిమా ప్రమోషన్స్ చేయటం లేదు మరియు ఆ సినిమాకి సంబందించిన కార్యక్రమాలకు కూడా రావటం లేదని కమెడియన్ అలీ అన్నారు. ఇటీవలే జరిగిన ‘మిస్ హైదరాబాద్ షో’ కి ముఖ్య అతిగా హాజరైన అలీ మాట్లాడుతూ ‘ మన ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్ అమ్మాయిలని హీరోయిన్స్ గా పెట్టుకుని వారికి కోటి రూపాయల వరకు పారితోషికం ఇస్తున్నారు. దానికి బదులు సౌత్ ఇండియన్ అమ్మాయిలను ప్రోత్సహించి వారికి 25 లక్షలు ఇస్తే సరిపోతుందన్నారు’.

అలాగే ఆయన మాట్లాడుతూ ‘ ముంబై తారలు అక్కడ లోకల్ ట్రైన్స్ లోనూ, ఆటోల్లోనూ మరియు ఒక చిన్న సింగల్ బెడ్ రూంలో ఉంటూ జీవితాన్ని లాగించేస్తుంటారు. కానీ వారు ఇక్కడికి వస్తే మాత్రం ఫైవ్ స్టార్ హోటల్స్ లో రూమ్ మరియు తిరగడానికి కాస్ట్లీ కార్లు డిమాండ్ చేస్తారు. ఇటీవలే ఇలియానా బాలీవుడ్లో చేసిన ‘బర్ఫీ’ అనే సినిమాకి 15 రోజులు ప్రమోషన్స్ చేస్తేనే తీసుకుంటాను లేకపోతే అవసరం లేదు అనడంతో ఇలియానా చచ్చినట్టు అక్కడ ప్రమోషన్స్ చేసింది. ఇక్కడ మాత్రం సింపుల్ గా వచ్చి నటించేసి మనీ తీసుకొని వెళ్లిపోతుంటారు. హరోయిన్ చేసే ప్రమోషన్ సినిమాకి మరియు ఆ నిర్మాతకి చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి వారిని ప్రోత్సహించడం కంటే మన సౌత్ ఇండియన్ భామలకు అవకాశాలు ఇవ్వవచ్చని’ ఆయన అన్నారు.

తాజా వార్తలు