ఓటిటి సెన్సేషన్ ‘పీకీ బ్లైండర్స్’ సినిమాకి డేట్ ఇచ్చేసిన నెట్ ఫ్లిక్స్!

ఓటిటి సెన్సేషన్ ‘పీకీ బ్లైండర్స్’ సినిమాకి డేట్ ఇచ్చేసిన నెట్ ఫ్లిక్స్!

Published on Dec 6, 2025 9:06 AM IST

Peaky Blinders

ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి ఆడియెన్స్ లో మంచి రీచ్ ఉన్న సెన్సేషనల్ హిట్ సిరీస్ లలో ఓపెన్ హైమర్ నటుడు కిలియన్ మర్ఫీ లీడ్ రోల్ లో నటించిన సాలిడ్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ కూడా పెద్ద హిట్. అయితే ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ఆ మధ్య సాలిడ్ న్యూస్ ని మేకర్స్ అందించారు. ఈ సిరీస్ ని ఒక సినిమాగా తీస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఫైనల్ గా ఈ సినిమాకి డేట్ ని నెట్ ఫ్లిక్స్ అందించింది. వచ్చే ఏడాది మార్చ్ 20న నేరుగా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేస్తున్నట్టుగా కిలియన్ పై ఓ స్ట్రైకింగ్ పోస్టర్ ని ‘పీకీ బ్లైండర్స్ – ది ఇమ్మోర్టల్ మ్యాన్’ అంటూ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. సో ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని టామ్ హార్పర్ దర్శకత్వం వహించగా కిలియన్ మర్ఫీ మరియు ఈ పాత్ర రచయిత స్టీవెన్ నైట్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు