పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది గ్రాండ్ గా సంక్రాంతి రేస్ లో తీసుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ ఈ సినిమా ఓటిటి డీల్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు అనే మాట అయితే ఉండిపోయింది. కానీ ఫైనల్ గా ఓ పాపులర్ సంస్థ ది రాజా సాబ్ ఓటిటి హక్కులు సొంతం చేసుకున్నారు అని తెలుస్తుంది.
రాజా సాబ్ ని సొంతం చేసుకున్న సంస్థ ఎవరంటే?
ఈ సినిమాని చాలా మంది నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవచ్చు అనుకున్నారు కానీ ట్విస్ట్ ఇస్తూ ది రాజా సాబ్ (The Raja Saab OTT) ని జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారట.
ది రాజా సాబ్ ఓటిటి డీల్ కి భారీ డీల్?
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న రూమర్స్ ప్రకారం రాజా సాబ్ ని జియో హాట్ స్టార్ వారు భారీ మొత్తమే ఇచ్చి సొంతం చేసుకున్నారట. మొత్తం పాన్ ఇండియా భాషలు కలిపి ఈజీగా 170 కోట్లకి పైగా ఇచ్చి సొంతం చేసుకున్నట్టుగా టాక్.
ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


