సమంత నటించే వెబ్ సిరీస్‌కు బ్రేకులు.. ఇక అటకెక్కినట్లేనా..?

samantha

స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా చిత్రాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లను కూడా ప్లాన్ చేస్తోంది. ఆమె ఇప్పటికే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె చేయబోయే నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దర్శకద్వయం రాజ్ & డికె తెరకెక్కించే ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌కు ముందే దీని ఆర్థిక లావాదేవీల్లో ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఇక రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ మేకర్స్‌తో చర్చలు జరిపిందట.

అయితే, ఇప్పట్లో ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కడం కష్టంగా తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌ అటకెక్కినట్లే అని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను తుంబాడ్ దర్శకుడు రాహి అనిల్ బర్వే డైరెక్ట్ చేయాల్సి ఉంది.

Exit mobile version