ఓటిటి సమీక్ష: ‘రానా నాయుడు’ సీజన్ 2 – నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 13, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : నెట్ ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, రాహుల్ వోహ్రా, కృతి ఖర్బందా, అర్జున్ రామ్ పాల్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్ తదితరులు.
దర్శకత్వం : సుప్రాన్ ఎస్ శర్మ, అభయ్ చోప్రాల
నిర్మాణం : సుందర్ ఆరోన్, షో టైం నెట్వర్క్స్, లోకో మోటివ్ గ్లోబల్ మీడియా
సంగీత దర్శకుడు : జాన్ స్టీవర్ట్
సినిమాటోగ్రాఫర్ : జాన్ స్కిమిడ్త్, అంజు సంతాని
ఎడిటర్ : నైనాద్ ఖణోల్కర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్ అలాగే రానా దగ్గుబాటిలు కలిసి ఒక వెబ్ సిరీస్ ని చేస్తున్నారు అనే మాట కొన్నేళ్ల కితం ఆడియెన్స్ ని ఎంతో ఎగ్జైట్ చేసింది. అలా వచ్చిన బోల్డ్ యాక్షన్ సిరీస్ నే “రానా నాయుడు”. మరి దానికి కొనసాగింపుగా వచ్చిన సీజన్ 2 ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

గత సీజన్లో జరిగిన విధ్వంసం తర్వాత రానా నాయుడు (రానా దగ్గుబాటి) ఇక తాను వర్క్ చేస్తున్న ఓబీ మహాజన్ (రాజేష్ జైష్) నుంచి బయటకి వచ్చి ఫ్యామిలీతో కలిసి ఒక హ్యాపీ లైఫ్ జీవించాలని డిసైడ్ అవుతాడు. కానీ ఇంతలో ముంబైకి చెందిన పేరు మోసిన గ్యాంగ్ స్టర్ రౌఫ్ మీర్జా (అర్జున్ రామ్ పాల్) మాటతో తన తమ్ముడు సైఫ్ రానా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. దీనితో రానాకి అత్యవసర సాయంలో పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్ విరాజ్ ఒబెరాయ్ (రాహుల్ వోహ్రా) సాయం చేస్తాడు. కానీ దానికి బదులుగా తనకో పని చెయ్యాలని రానాని మళ్ళీ తాను వదిలెయ్యాలి అనుకునే ఉచ్చులోకే లాగుతాడు. దీనితో కొడుకు కోసం ఒక్క లాస్ట్ అసైన్మెంట్ గా బరిలోకి దిగిన రానాకి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ క్రమంలో తన భార్య నైనా నాయుడు (సుర్వీన్ చావ్లా) ఏం చేస్తుంది? తన తమ్ముడిని, మనుషుల్ని చంపేసిన రానాపై రౌఫ్ ఏం ప్లాన్ చేస్తాడు. వీరితో పాటుగా రానా తండ్రి నాగ నాయుడు పాత్ర ఎలా కలిసింది? ఒబెరాయ్ కీర్తిని లీడ్ చెయ్యాలి అనుకునే ఆలియా (కృతి ఖర్బంద) ఏం చేసింది? చివరికి రానా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా? తన పాత్ర ఎలా ముగుస్తుంది అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సీజన్ దాదాపు ఎవరికి నచ్చుతుంది అంటే దాదాపు మొదటి సీజన్ కి బాగా కనెక్ట్ అయ్యినవారికి నచ్చవచ్చు అని చెప్పాలి. వెంకీ మామ అండ్ రానాల నుంచి ఆ రేంజ్ లో బోల్డ్ కంటెంట్ ని జనం ఆశించలేదు కాబట్టి గట్టి నెగిటివిటీ వచ్చింది కానీ ఇందులో దానిని మేకర్స్ దాదాపు బాలన్సుడ్ గానే నడిపించే ప్రయత్నం చేశారు. ఆ సీజన్ తో పోలిస్తే బూతులు, అశ్లీల సన్నివేశాలు లిమిటెడ్ గా మార్చారు.

ఇక మొత్తం 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సీజన్ లో దాదాపు కథనం ఎంగేజింగ్ గానే నడుస్తుంది. డీసెంట్ యాక్షన్ ఇంకా డ్రామా లతో కథనం మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు బాగానే కొనసాగుతుంది. అలాగే సమస్యలు కోరి తెచ్చుకోవడంతో రానా పాత్ర మరింత కూరుకుపోవడం నెక్స్ట్ ఏం జరుగుతుంది? రానా తీసుకునే స్టెప్స్ ఏంటి ఆ మైండ్ గేమ్ కొన్ని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. ఇక వీటితో పాటుగా కొన్ని చోట్ల ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా ఫ్యామిలీ మూమెంట్స్ ప్లెజెంట్ గా అనిపిస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే రానా ఈ సీజన్ కి పిల్లర్ అని చెప్పవచ్చు. వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సీజన్ ని తాను భుజాలపై నడిపించాడు. తన నటన, యాక్షన్ ఎమోషన్స్ తన డైనమిక్ ప్రెజెన్స్ ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి. ఇక వెంకీ మామ తన రోల్ లో షైన్ అయ్యారు. గత సీజన్ తరహాలో మరీ ఎక్కువ యాక్షన్ లేదు కానీ తన నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం తన ఫ్యాన్స్ కి దక్కుతుంది. తన ఫన్ డైలాగ్స్, యాటిట్యూడ్ వంటివి ఇంప్రెస్ చేస్తాయి.

ఇక వీరితో పాటుగా సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీలు తమ టాలెంట్ తో సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే నటుడు రాహుల్ వోహ్రా తన పాత్రలో వెర్సటాలిటీ చూపించారు. అంతే కాకుండా నటి కృతి ఖర్బందా కూడా మంచి రోల్ దక్కించుకున్నారు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇక ఈ సిరీస్ లో బలహీనతలు చూసుకుంటే మరీ అంత స్ట్రాంగ్ కథనం ఈ సీజన్ లో కనిపించలేదు. రానాపై డెవలప్ చేసుకున్న అంశాలు వరకు ఓకే కానీ మిగతా పాత్రలు వరకు మాత్రం కథనం ఒకింత బలహీనంగా అనిపిస్తాయి. నిజానికి వెంకీ మామ పాత్ర కూడా మరీ అంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యినట్టుగా అనిపించలేదు.

ఇక వీటితో పాటుగా ఇంకా కొన్ని మూమెంట్స్ ని సాలిడ్ గా డిజైన్ చేసి ఉంటే ఆడియెన్స్ మరింత థ్రిల్ కలిగి ఉండేది. ఈ సిరీస్ లవర్స్ కి కూడా ఆ భావన కలుగుతుంది. ఇంకా చాలా వరకు లాజిక్స్ కూడా ఈ సిరీస్ లో మిస్ అయ్యాయి. రానా కూతురు పాత్ర తన లవర్ తోనే ఎందుకు అంతలా తిరుగుతుందో అర్ధం కాదు.

అలాగే రాహుల్ వోహ్రా కేసులో చూపించే చిన్న చిన్న అంశాలు ఒకింత సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా నెగిటివ్ పాత్రలో చేసిన అర్జున్ రామ్ పాల్ పాత్ర కూడా ఓవరాల్ గా అంత స్ట్రాంగ్ గా అనిపించదు. ఇలాంటి వాటిని ఇంకా మెరుగ్గా డెవలప్ చేసి ఉంటే రానా నాయుడు సీజన్ 2 మరింత స్ట్రాంగ్ ట్రీట్ ఇచ్చి ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ సీజన్లో కూడా నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. కథనంకి కావాల్సిన సెటప్ యాక్షన్ మోడ్ లో కావాల్సిన అంశాలు అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. జాన్ స్కిమిడ్త్, అంజు సంతాని ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. రానాపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ఫ్లాట్స్ నుంచి కిందకి వస్తూ చూపించేది బాగా డిజైన్ చేశారు. నైనాద్ ఖణోల్కర్ ఎడిటింగ్ బానే ఉంది కానీ కథనం ఇంకొంచెం ఫాస్ట్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. జాన్ స్టీవర్ట్ సంగీతం బాగుంది. పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ బాగున్నాయి.

ఇక దర్శకులు సుప్రాన్ ఎస్ శర్మ, అభయ్ చోప్రాల విషయానికి వస్తే.. వీరి వర్క్ దాదాపు బాగానే ఉంది కానీ ఇంకా ఏదో మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యి సింపుల్ గా కొన్ని సీన్స్ ని కానిచ్చేశారు. అలాగే మరింత యాక్షన్, మరింత మాస్ మూమెంట్స్ ని రానాపై సెట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ ని కూడా ఇంకొంచెం మంచి డోస్ లో ప్లాన్ చేసుకొని ఉంటే బాగుణ్ణు. ఇంకొంచెం ఎంగేజింగ్ గా కథనం ప్లాన్ చేసుకొని ఉంటే వారి వర్క్ మరిన్ని మార్కులు పడేవి.

తీర్పు:

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే ఈ “రానా నాయుడు – సీజన్ 2” అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది అని చెప్పొచ్చు. లీడ్ నటీనటులలో రానా మంచి పెర్ఫామెన్స్ అందించాడు. అయితే తనతో పాటుగా మిగతా మెయిన్ పాత్రలు (అందులో వెంకీ మామ కూడా) ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. ఈ అంశాలు కూడా పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయడంలో దర్శకులు తడబడ్డారు. ఇంకా కొన్ని లాజిక్స్ కూడా సింపుల్ గా అనిపిస్తాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే రానా నాయుడు సీజన్ 2 కొంతమేర ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version