స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాకి ఒకింత దూరంగానే ఉన్న సంగతి తెలిసిందే. తనకి ఆరోగ్యం బాగోని కారణంగా సినిమా కెరీర్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే నిర్మాతగా ఇంకా నటిగా కూడా తన కొత్త సినిమా ‘శుభం’ తో వచ్చింది.
అయితే తాను చిన్న క్యామియో రోల్ లో నటించగా యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు ఈ సినిమా ఎట్టకేలకి ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ జూన్ 13న రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు చూడాలి అనుకుంటే ఇంకొన్ని రోజులు తర్వాత చూడొచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి