హీరోయిన్ల పై సీనియర్ హీరోల మధ్య చర్చ !

హీరోయిన్ల పై సీనియర్ హీరోల మధ్య చర్చ !

Published on Aug 11, 2025 11:58 PM IST

సీనియర్ హీరో జగపతిబాబు హోస్టుగా ఓ టాక్ షో రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ షోకు తొలి గెస్ట్ గా కింగ్ నాగార్జున హాజరయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వైరలవుతోంది. జగపతిబాబు హోస్ట్ గా నాగార్జునను ఓ ప్రశ్న అడుగుతూ.. ‘మీకు బెస్ట్ కో-యాక్ట్రెస్ ఎవరు ?, రమ్యకృష్ణ, లేక టబు ?’ అని జగపతిబాబు అడగ్గా.. ఈ ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ ‘కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను’ అంటూ నాగార్జున సమాధానం చెప్పారు.

అలాగే, రివర్స్‌లో జగపతిబాబును నాగార్జున ప్రశ్న అడుగుతూ..‘రమ్యకృష్ణ, సౌందర్యలో నీ ఫేవరెట్ ఎవరు ?’ అని జగపతిబాబును నాగ్ అడిగారు. నాగార్జున అడిగిన ప్రశ్నకు జగపతిబాబు సమాధానం చెప్పకుండా ‘ఇది నా ఇంటర్వ్యూ కాదు. నేను ఆన్సర్ చెప్పను’ అంటూ తప్పించుకున్నారు. మొత్తానికి ఈ షోలో ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య సరదా ముచ్చట్లు బాగానే జరిగాయి. ఈ షో ప్రోమో చూస్తుంటే.. ఈ షో హిట్ అయ్యేలా ఉంది.

తాజా వార్తలు