బాహుబలి సెట్ ని సందర్శించిన ఆస్కార్ విజేత

బాహుబలి సెట్ ని సందర్శించిన ఆస్కార్ విజేత

Published on Jan 20, 2014 3:00 PM IST

bahubali
ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నిర్వాహన టీంకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం జరిగింది. ప్రముఖ ఫ్రెంచ్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ క్లాడ్ లేలౌచ్ ‘బాహుబలి’ సెట్ ని సందర్శించాడు. అక్కడి నటినటులతో కూడా ఆయన కాసేపు గడిపారు. క్లాడ్ లేలౌచ్ ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. గడిచిన నాలుగు దశాబ్దాలలో ఆయన చాలా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ పురాణ పీరియడ్ డ్రామా లో ప్రభాస్, రానా దగ్గుపాటి అన్నదమ్ముల్లుగా నటిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆర్క మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ రాజమాతగా కనిపించనుంది.

తాజా వార్తలు