మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాల్లో తన మాస్ ని మ్యాచ్ చేసే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా ఈ షూటింగ్ కూడా ఇపుడు ప్లాన్డ్ గా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం నుంచి రానున్న మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ ఉండొచ్చు అని టాక్ వచ్చింది.
కానీ ఇపుడు ఈ ట్రీట్ ఉండకపోవచ్చట. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే ఆరోజు రివీల్ చేసే ఛాన్స్ ఉందట. ఎందుకంటే ఆల్రెడీ వార్ 2 నుంచి టీజర్ కన్ఫర్మ్ కావడంతో ఆరోజున నీల్ ప్రాజెక్ట్ నుంచి పోస్టర్ మాత్రమే వస్తుంది అని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ప్రస్తుతం అయితే తారక్ అభిమానులు ఆ బిగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.