కరోనా వైరస్ అందరి స్టార్ హీరోల ప్లాన్స్ మార్చివేసింది. 2020లో ఒకరిద్దరు మినహా ఏ స్టార్ హీరో తమ సినిమా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు పూర్తికావడంతో ఈ సినిమా కొద్దిరోజులలో విడుదల కానుంది. ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ మూవీ కూడా ఈ ఏడాది రావడం కష్టంగానే కనిపిస్తుంది. సుకుమార్- బన్నీల పుష్ప 2021 సమ్మర్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా స్టార్ హీరోలందరూ కరోనా కారణంగా వెనుకబడిపోయారు.
ఈ నేపథ్యంలో 2021లో ఎన్టీఆర్ మరియు పవన్ మాత్రమే రెండు చిత్రాలు విడుదల చేసే అవకాశం ఉంది. బన్నీ, ప్రభాస్, చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోల నుండి రెండో మూవీ 2021లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎన్టీఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ తో పాటు, త్రివిక్రమ్ మూవీ ఖచ్చితంగా విడుదల కానున్నాయి. అలాగే పవన్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ 2021 ఏడాది ప్రారంభంలో, హరీష్ శంకర్ మూవీ చివర్లో విడుదల కావచ్చు. మహేష్ ఇంకా కొత్త సినిమా ప్రకటనే చేయలేదు కాబట్టి ఆయన నుండి కేవలం ఒక చిత్రం మాత్రమే అంచనా వేయగలం. కాబట్టి 2021లో ఎన్టీఆర్, పవన్ మాత్రమే రెండు చిత్రాలు విడుదల చేసే అవకాశం కలదు.