బీదర్ వెళ్ళిన ఒంగోలు గిత్త

బీదర్ వెళ్ళిన ఒంగోలు గిత్త

Published on Dec 2, 2012 9:18 AM IST

యూత్ ఫుల్ హీరో రామ్ ప్రధాన పాత్రలో రానున్న “ఒంగోలు గిత్త” చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దాదాపుగా గుంటూరు,తణుకు మరియు హైదరాబాద్లలో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఒక పాట చిత్రీకరణ కోసం బీదర్ వెళ్లనుంది. దీని తరువాత ప్యాచ్ వర్క్ కాకుండా మరో పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. కృతి కర్భంద ఈ చిత్రంలో రామ్ సరసన కనిపించనుంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నటి శుభ పుతేలా అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు చిత్రీకరణ జరుపుకోలేదు కాని తరువాత ఆమె స్థానంలో కృతి కర్భందని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం డిసెంబర్ చివర్లో కాని 2013 మొదట్లో కాని విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు