రామ్ రాబోతున్న చిత్రం “ఒంగోలు గిత్త” చిత్రంలో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. కృతి కర్భంద ఈ చిత్రంలో రామ్ సరసన కనిపించనుంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో చివరి పాట జనవరి 10 నుండి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రం గుంటూరు,తణుకు మరియు హైదరాబాద్ లలో చిత్రీకరణ జరుపుకుంది. “కందిరీగ” చిత్రం తరువాత రామ్ చేస్తున్న మాస్ చిత్రం ఇది. జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో జనవరి 12న విడుదల చెయ్యనున్నారు.