సంక్రాంతి రేసులో మరో మెగా హీరో?

సంక్రాంతి రేసులో మరో మెగా హీరో?

Published on Oct 15, 2012 8:31 AM IST


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో కూడా నటించి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ నిర్మాతగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి రెండవ అబ్బాయి అల్లు శిరీష్ ని పరిచయం చేస్తున్న చిత్రం ‘గౌరవం’. తాజా సమాచారం ప్రకారం ఇంకా ఈ చిత్రంలో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాట అనుకున్న టైంకి చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో ‘ఆకాశమంత’ మరియు ‘గగనం’ లాంటి విభిన్న తరహా సినిమాలు తీసిన రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ కథానాయికగా నటిస్తోంది. ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిస్తున్న ఈ ద్వి భాషా చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు