మెగా ఫ్యామిలీలో మరొకరిపై వర్మ మూవీ, టైటిల్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీలో మరొకరిపై వర్మ మూవీ, టైటిల్ ఏంటంటే?

Published on Jul 30, 2020 2:18 AM IST


పవర్ స్టార్ పేరుతో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వర్మ చేసిన మూవీ ఎన్ని వివాదాలకు తెరలేపిందో తెలిసిందే. చివరకు వర్మ ఆఫీస్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి చేయడం జరిగింది. డిజిటల్ విడుదల కావడంతో వర్మ పని పూర్తి అయ్యింది. ఆ మూవీ విడుదల తరువాత వర్మపై పవన్ ఫ్యాన్స్ కి కోపం తగ్గింది. కాగా వర్మ మెగా ఫ్యామిలీకి చెందిన నిర్మాత అల్లు అరవింద్ పై మూవీకి సిద్ధం అవుతున్నాడని, సమాచారం. అలాగే ఆ మూవీకి టైటిల్ గా బావ రాజ్యం అనే టైటిల్ కూడా అనుకుంటున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతుంది.

2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఆ పార్టీలో కీలక పాత్రను అల్లు అరవింద్ పోషించారు . నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక విషయాలు ఆయన నెరవేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్మ బావరాజ్యం మూవీ తెరకెక్కనుందని వినికిడి. మరి ఇదే విషయంపై మూవీ చేస్తే వర్మ మరో సంచలనానికి తెరలేపడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు