ప్రస్తుతం హీరోయిన్ అంజలికి చాలా గడ్డు కాలం గడుస్తోందని చెప్పాలి. అంజలి మరియు ఆమె పిన్ని భారతి దేవి మధ్య గత కొద్ది రోజులగా పబ్లిక్ గా నే యుద్ధం జరుగుతోంది. తాజాగా అంజలి పై భారతి దేవి ఈ రోజు ఫ్యామిలీ కోర్టులో ఒక పిటీషన్ ని దాఖలు చేసారు. ఈ పిటీషన్ లో నెలకు 50,000 రూపాయలు అంజలి తనకు చెల్లించాలని దాఖలు చేసింది.
భారతి దేవి అంజలిని హీరోయిన్ గా చెయ్యడం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని తెలిపింది. దానికి ఇప్పుడు పరిహారం కింద ఈ మొత్తం చెల్లించమని డిమాండ్ చేసింది. ఈ కేసు మళ్ళీ ఆగష్టు 14న హియరింగ్ కి రానుంది. ప్రస్తుతం అంజలి వెంకటేష్ – రామ్ హీరోలుగా నటిస్తున్న ”గోల్ మాల్” షూటింగ్ లో బిజీగా ఉంది.