ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి కరోనా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడడంతో రాజమౌళి ఇంటికే పరిమితం అవుతున్నారు. దీనితో ఆయన వెనుకపడుతున్న మీడియా ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కాగా బాలకృష్ణతో ఎప్పుడైనా మూవీ చేయాలని అనుకున్నారా అని అడుగగా ”ఏ దర్శకుడికైనా ప్రతి హీరోతో మూవీ చేయాలని ఆశ ఉంటుంది. ఒక హీరోకి ఉండే ఇమేజ్ దృష్ట్యా కథ అనుకుంటున్నప్పడు ఆ హీరో ఐతే సరిపోతాడు అనిపిస్తుంది. నాకు కూడా కొన్ని కథలు వినేటప్పుడు బాలకృష్ణ సరిపోతారు ఆయనతో చేస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది. ఐతే అనుకోని కారణాల వలన ఆయనతో మూవీ కార్యరూపం దాల్చలేదు” అని రాజమౌళి అన్నారు.
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని పరిచయం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విశేష స్పందన అందుకుంది. దీనితో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో పై భారీ అంచనాలున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.