ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకోవానుకుందట.

ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకోవానుకుందట.

Published on Jun 23, 2020 8:41 AM IST

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చిత్ర పరిశ్రమలో సంచలనం రేపగా, ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో నటులకు ఎదురయ్యే ఒత్తిడి… దాని వలన ఏర్పడే ఆత్మ హత్య వంటి ఆలోచనల గురించి అందరూ మాట్లాడుతున్నారు. డిప్రెషన్ ఎదుర్కోనున్న నటులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కాగా హీరోయిన్ మరియు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ నందిని రాయ్ కూడా ఒక దశలో ఆత్మ హత్య చేసుకోవాలి అనుకుందట.

2015లో నందిని రాయ్ మోసగాళ్లకు మోసగాడు మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ విజయం సాధించకపోవడంతో ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ వెనక్కిపోయాయట. దీనితో నందిని ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నారట. గట్టి పోరాటంతో ఆ సమస్య నుండి బయటపడగలిగాను అని నందిని రాయ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు