కోలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ ఎక్కడా చూడనంతగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ టాప్ హీరోలైన విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉంటుంది. వీరి మధ్య ఫ్యాన్ వార్ అప్పుడప్పుడూ హద్దులు దాటి అనేక విమర్శలకు గురి అవుతూ ఉంటుంది. కాగా నేడు హీరో అజిత్ పుట్టిన రోజు కావడంతో అజిత్ ఫ్యాన్స్ హెచ్ బి డి డియరెస్ట్ అజిత్ అనే యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుండగా మరో వైపు విజయ్ ఫ్యాన్స్ విజయ్ ది పేస్ ఆఫ్ కోలీవుడ్ అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ వేస్తూ అజిత్ ఫ్యాన్స్ కి పోటీ ఇస్తున్నారు.
నేడు వీరి మధ్య ట్విట్టర్ వార్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య ఫాన్ వార్ అనేక విపరీతాలకు దారితీస్తున్న తరుణంలో చాలామంది విమర్శిస్తున్నారు. ఇక విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉండగా, అజిత్ వాలిమై షూటింగ్ లో పాల్గొంటున్నారు.