గ్రాండ్ గా విడుదల కానున్న ‘ఓం 3డి ‘

గ్రాండ్ గా విడుదల కానున్న ‘ఓం 3డి ‘

Published on Jul 17, 2013 1:05 PM IST

Om-(2)

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఓం 3డి’ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రూ. 25 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారని సమాచారం. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని అన్ని ఏరియాలలో వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించడం జరిగింది. ఈ సినిమాలోని 3డి ఎఫెక్ట్స్ కోసం మంచి పేరున్న టెక్నిషియన్స్ పనిచేయడం జరిగింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ అవతారలలో కనిపించనున్నాడు. కృతి ఖర్బంద, నికిష పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని సునీల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు