సెన్సార్ పూర్తి చేసుకున్న నారా రోహిత్ ‘ఒక్కడినే’

సెన్సార్ పూర్తి చేసుకున్న నారా రోహిత్ ‘ఒక్కడినే’

Published on Dec 25, 2012 12:50 PM IST

Okkadine

నారా వారి అబ్బాయి నారా రోహిత్ హీరోగా, మళయాళ కుట్టి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ‘ఒక్కడినే’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అయినా ఫైనాన్సియల్ ఇబ్బందులు ఉండడం వల్ల సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఇంకా విడుదల తేదీ పైన ఖచ్చితమైన ప్రకటన లేని ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ సినిమాని సి.వి రెడ్డి నిర్మించాడు. ప్రముఖ సింగర్ కార్తీక్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు