‘ఓహో రత్తమ్మ’ అంటూ మాస్ దరువు అందుకున్న విశ్వక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో సినీ ప్రేమికుల్లో సైతం ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీపై అంచనాలను పెంచేస్తూ ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్.. ఇలా అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ మాస్ ఫోక్ సాంగ్‌ను పెంచల్ దాస్ రచించి పాడారు. ఆయనతో పాటు మధుప్రియ కూడా ఈ సాంగ్ పాడింది. ఇక ఈ పాటకు లియోన్ జేమ్స్ అందించిన మాస్ బీట్స్ పక్కా డ్యాన్స్ నెంబర్‌గా ఈ పాటను నిలిపింది. కాగా ఈ పాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ‘కోయ్.. కోయ్..’ అనే ట్రాక్ కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘లైలా’ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version