నైజాంలో ‘ఓజి’ మొదటి టికెట్ అక్షరాల 5 లక్షలు.. కొన్నది ఎవరంటే!

OG

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనన్య సామాన్యం అని అందరికీ తెలిసిందే. తన 54 వ పుట్టినరోజు ఇప్పుడు రాగా అభిమానులు ఈ పుట్టినరోజుని ఎంతో స్పెషల్ గా చేసుకుంటున్నారు. ఇక ఈ పుట్టినరోజుకి ఓజి పై క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా వినిపిస్తోంది.

తన నుంచి రాబోతున్న అవైటెడ్ ఓజి చిత్రం తాలూకా మొదటి నైజాం టికెట్ అక్షరాల 5లక్షల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ టికెట్ ని పవన్ కళ్యాణ్ యూఎస్ లో నార్త్ అమెరికా అభిమాన బృందం కొనుగోలు చేశారట.

దీనితో ఈ రికార్డ్ ధర వైరల్ గా మారింది. ఇక ఈ టికెట్ తాలూకా డబ్బులని అభిమానులు పవన్ పార్టీకి డొనేట్ చేయనున్నారని టాక్ వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకు రాబోతున్నారు.

Exit mobile version