‘మిరాయ్’లో మహేష్ బాబు.. తేజ సజ్జా చెప్పిన నిజం ఇదే..!

Mirai-Mahesh-Babu

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా ఈ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను తేజ సజ్జా చాలా స్పీడుగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా టీజర్‌లో శ్రీరాముడిని చూపెట్టారని.. ఆ పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు చేశాడా..? అని ఓ విలేకరి అడిగాడు. దీనికి తేజ సజ్జా కూడా తనదైన స్టయిల్‌లో జవాబిచ్చాడు.

మహేష్ బాబు ఈ సినిమాలో నటించలేదని.. అయితే, శ్రీరాముడి పాత్రలో నటించింది ఎవరనే విషయం పై తాము ఇప్పుడే రివీల్ చేయలేమని ఆయన అన్నారు. దీంతో అసలు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version